కార్లలో ఒకటి కాదు, మొత్తం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉండాల్సిందే : కేంద్రం

All Cars Should Have Six Airbags Within A Year Says Nitin Gadkari   - Sakshi

దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్ని అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా కార్ల తయారీ సంస్థలు కార్లలో ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లను అమర్చాలని కేంద్రం రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు.  

కేంద్ర రవాణా శాఖ సర్వే ప్రకారం.. మనదేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి రోజు 400మంది మరణిస్తుండగా.. ఏడాదికి 5 లక్షల రోడ్డు ప్రమాద బాధితుల్లో  1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్రం రోడ్డు ప్రమాదాల్ని అరికట్టేందుకు కీలక నిర‍్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ  న్యూఢిల్లీలో సియామ్ (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల) సీఈఓల ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు.

ఈ భేటీలో రోడ్డు ప్రమాదాల్ని అరికట్టేందుకు కనీసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను ఇన్‌స్టాల్ చేయాలని ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ ఆటోమొబైల్ తయారీదారులకు సూచించారు. ఒక ఎయిర్‌ బ్యాగ్‌ ఉన్న పాత కార్లలో డ్యూయల్‌ ఎయిర్‌ బ్యాగ్‌లను అమర్చేందుకు ఏప్రిల్ 1, 2021వ తేదీ నుండి డిసెంబర్ 31, 2021 వరకు గడువు ఇచ్చారు. ఏడాది లోపు అన్నీ మోడల్‌ కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు యాంటీలాక్‌ బ్రేకింగ్‌ సిస్టం(abs) ను ఏర్పాటు చేయాలని స‍్పష్టం చేశారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top