లక్షన్నర మందికి 3 లక్షల ఎకరాలు

YS Jagan Gives Land Rights Of Scheduled Tribes Today - Sakshi

గిరి పుత్రులకు నేడు హక్కు పత్రాల పంపిణీ 

ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీని ప్రారంభించనున్న సీఎం జగన్‌ 

పాడేరు మెడికల్‌ కాలేజీ, ఐటీడీఏల్లో మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రుల పనులకు శ్రీకారం 

సాక్షి, అమరావతి: పోడు వ్యవసాయాన్ని నమ్ముకున్న దాదాపు లక్షన్నర మంది గిరిజన రైతుల స్వప్నం గాంధీ జయంతి రోజు సాకారం కానుంది. గిరిజన రైతులకు వారు సాగు చేసుకుంటున్న అటవీ భూములపై హక్కులు కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం పత్రాలను పంపిణీ చేయనున్నారు.  

తొలిసారిగా గిరిజన రైతులు సాగు చేసుకునే అటవీ భూములపై దివంగత వైఎస్సార్‌ హక్కు పత్రాలను అందచేశారు. 1,30,679 ఎకరాలకు సంబంధించి 55,513 ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలను ఆయన పంపిణీ చేశారు. తరువాత ప్రభుత్వాలు గిరిజన సంక్షేమాన్ని విస్మరించాయి. ఇప్పుడు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం మరోసారి అదే స్థాయిలో పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసింది.   

సరిహద్దులను గుర్తించడం, రాళ్లు పాతడం, వెబ్‌ల్యాండ్, ఆర్వోఎఫ్‌ఆర్‌ డేటా బేస్‌లో వివరాల నమోదు ఇప్పటికే పూర్తయింది.  

ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దాదాపు 1.53 లక్షల మంది గిరిజన రైతులకు సుమారు మూడు లక్షల ఎకరాలకు సంబంధించి ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. (దర్యాప్తు ప్రారంభానికి ముందే స్టే ఎలా ఇస్తారు?)

ఏజెన్సీలో మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రులకు నేడు శ్రీకారం 
పాడేరు మెడికల్‌ కాలేజీతోపాటు ఐటీడీఏ ప్రాంతాల్లో మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణ పనులను సీఎం జగన్‌ శుక్రవారం ప్రారంభిస్తారు. సీతంపేట (శ్రీకాకుళం), పార్వతీపురం (విజయనగరం), రంపచోడవరం (తూర్పుగోదావరి), బుట్టాయగూడెం (పశి్చమగోదావరి), దోర్నాల (ప్రకాశం)లో ఆస్పత్రుల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.246 కోట్లు విడుదల చేసింది.  

నవరత్నాల్లో భాగంగా గిరిజన సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ ఏజెన్సీలో అక్షరాస్యత పెంచడంతో పాటు ఆరోగ్య సంరక్షణకు పలు కార్యక్రమాలను చేపట్టారు. అధికారం చేపట్టగానే గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్టీ ఉప ప్రణాళిక కింద రూ.5177.54 కోట్లు కేటాయించగా సెపె్టంబర్‌ నెలాఖరు వరకు 184 పథకాల కింద గిరిజనుల కోసం రూ.2,560.33 కోట్లను వ్యయం చేశారు.  

విజయనగరం జిల్లా కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.153.85 కోట్లను విడుదల చేసింది.     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top