కేంద్రం విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాలి: విజయసాయిరెడ్డి

Vijaya sai Reddy Spoke On Issues Discussed In All Party Meeting - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ ఎంపీలు హాజరయ్యారు. 

కాగా, అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టి కి తీసుకువెళ్లాము. గత మూడు దశబ్దాలలో రాని వరదలు ఇప్పుడు వచ్చాయి. వరద ముంపు జిల్లాలకు కేంద్రం నష్ట పరిహారం ఇవ్వాలి. దీనిపై పార్లమెంట్‌లో చర్చించాలి. 

ఏపీ విభజన చట్టంలోని అన్ని అంశాలు నెరవేర్చాలి. విశాఖ రైల్వే జోన్‌పై కాలయాపన ఎందుకు చేస్తున్నారు. విశాఖ రైల్వే జోన్‌ సాధనకు కృషి చేస్తాము. భోగాపురం విమానాశ్రయం అనుమతులు, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. ప్రతీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలి. జీఎస్టీ నష్టపరిహారం కాల పరిమితి మరో అయిదేళ్లు పెంచాలి’’ అని కోరినట్టు తెలిపారు. 

ఇది కూడా చదవండి: సీఎం జగన్‌ ఆదేశాలు.. మంత్రులు ఏరియల్‌ సర్వే

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top