శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు

Sun Light Touch Palakollu Sri Ksheera RamaLingeswara Swamy Temple - Sakshi

సాక్షి, పాలకొల్లు: పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో విశేషం సంతరించుకుంది. అర్చకులు కిష్టప్ప తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 6.60 గంటల సమయంలో గాలిగోపురం నుంచి నేరుగా శివలింగాన్ని సూర్యకిరణాలు తాకాయి. సాధారణంగా ఏటా చైత్ర మాసంలో శ్రీరామనవమి రో జు, అంతకు ముందు, ఆ తర్వాత రోజుల్లో శివలింగాన్ని సూర్యకిరణాలు తాకుతుంటాయి. అయితే భాద్రపద మాసంలో సూర్యకిరణాలు తాకడం ప్రత్యేకతను సంతరించుకుంది. అన్ని గ్రహాలు ఒకే కూటమిలో ఉండటం వల్ల ఇలా జరిగి ఉండవచ్చ ని కిష్టప్ప భావిస్తున్నారు. ఇదిలాఉండగా త్వరలోనే కరోనా అంతం కానుందని, ఎన్నడూ లేని విధంగా సెప్టెంబర్‌లో సూర్యకిరణాలు స్వామిని తాకడమే ఇందుకు నిదర్శనమని భక్తులు అంటున్నారు.   

మద్దిలో సోషల్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ 
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామిని శనివారం సోషల్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ కె.హర్షవర్దన్‌ దర్శించుకున్నారు. స్వామి దర్శనం అనంతరం ఆయన్ను అర్చకులు దుశ్శాలువాతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. ఆలయ ఈవో టీవీఎస్‌ఆర్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top