
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లోని తాడ–దువ్వాడ సెక్షన్‌లో ట్రాక్ మరమ్మతుల కారణంగా ఆగస్టు 26, 28, 30 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ పీఆర్వో నుస్రత్ మండ్రూప్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాజమండ్రి–విశాఖపట్నం(67285), కాకినాడ పోర్టు–విశాఖపట్నం(17267), విశాఖపట్నం–కాకినాడ పోర్టు(17268), గుంటూరు–విశాఖపట్నం(22876), విశాఖపట్నం–గుంటూరు(22875), విజయవాడ–విశాఖపట్నం(12718), విశాఖపట్నం–విజయవాడ(12717) రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు.