Two injured in accident on Tirumala ghat road - Sakshi
Sakshi News home page

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. బస్సు బోల్తా

May 24 2023 3:15 PM | Updated on May 24 2023 4:12 PM

Road Accident In Tirumala Ghat Road - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం‌ జరిగింది. అలిపిరి డిపోకు చెందిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు 28వ మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. అయితే బస్సులో ఇద్దరూ ప్రయాణికులు మాత్రమే తిరుమల నుంచి తిరుపతికి ప్రయాణిస్తున్నారు.. బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరూ ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

తిరుమలలో విధులు ముగించుకుని తిరుపతికి ప్రయాణమైన ఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ బస్సులో‌ ఉండడంతో వెంటనే స్పందించి బస్సు అద్దాలను పగలగొట్టి బయటకు వచ్చారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు తేల్చారు. బస్సును తొలగించి, ట్రాఫిక్‌ని పోలీసులు క్రమబద్ధీకరించారు.


చదవండి: ‘ప్రేమ పేరుతో మోసం.. జీవితంలో మర్చిపోలేని బాధనిచ్చాను’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement