Sakshi News home page

పిల్లల భోజనంపైనా ఏడుపేనా? 

Published Mon, Jul 24 2023 4:13 AM

Eenadu false writings on mid day meal in schools - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది మంది పేదింటి పిల్లలకు చదువు, పుస్తకాల నుంచి మధ్యాహ్నం పౌష్టికాహార భోజనం వరకు అన్ని వసతులు కల్పించడం కూడా రామోజీరావుకు తప్పుగానే కనిపిస్తోంది. పిల్లలు సంతృప్తిగా తినేలా రుచికరమైన ఆహారం అందిస్తుంటే ఆ అన్నంలో మట్టి కొట్టాలని చూస్తున్నారు. గత ప్రభుత్వంలో మధ్యాహ్న భోజనం పేరుతో నిధులు నొక్కేసి, ఎనిమిదితొమ్మిది నెలలకు కూడా బిల్లులు చెల్లించకపోయినా, నాసిరకం ఆహారం అందించినా ఈనాడు పత్రిక పట్టించుకున్న పాపానపోలేదు.

ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న గోరుముద్ద’ పేరుతో రోజుకో మెనూ, పిల్లల ఆరోగ్యం కోసం రాగిజావ, చిక్కీ అందిస్తున్నా, వాటికి అవసరమైన నిధులను ముందే విడుదల చేస్తున్నా.. ఈనాడుకు కంటగింపుగా మారింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ‘మాటల్లోనే మధ్యాహ్న భోజనం’ అంటూ ఆధారాలు లేకుండా అడ్డగోలు రాతలు రాసింది. రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా ‘జగనన్న గోరుముద్ద’ పథకాన్ని పర్యవేక్షిస్తున్నారు.

ఈ ఏడాది బడ్జెట్‌లో ఒకటి నుంచి పదో తరగతి వరకు 44,392 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 37,63,698 మంది విద్యార్థుల పౌష్టికాహారం కోసం రూ. 1,689 కోట్లు కేటాయించారు. ఏజెన్సీలకు, వంటవారికి, సహాయకులకు ఏ నెలకు ఆ నెల చెల్లింపులు జరుగుతున్నాయి. అయినా అబద్ధపు రాతలకు ఈనాడు తెగబడింది.  

అప్పటికీ.. ఇప్పటికీ ఎంతో తేడా 
చంద్రబాబు హయాంలో 2019కి ముందు వారంలో ఎక్కువ రోజులు అన్నం, పప్పు లేదా నీళ్ల సాంబారుతోనే పిల్లలకు మధ్యాహ్న భోజనం సరిపెట్టేవారు. అది తినలేక పిల్లలు ఎంత ఇబ్బంది పడ్డా మెనూ మార్చిన పరిస్థితే లేదు. కానీ 2020లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగతంగా గోరుముద్ద మెనూ రూపొందించి, పిల్లలకు పోషకాహారం అందించాలని ఆదేశించారు.

పర్యవేక్షణకు ప్రత్యేక విభాగాన్నే పెట్టారు. విద్యార్థులందరికీ ఫోర్టిఫైడ్‌ సార్టెక్స్‌ బియ్యంతో అన్నం, వారంలో ఐదు రోజులు గుడ్డు, మూడు­రోజులు చిక్కీ అందిస్తున్నారు. విద్యా­ర్థుల్లో పోషకాహార లోపం, రక్తహీనత వంటి సమస్యలను అధిగమించేందుకు రాగిజావను సైతం మెనూలో చేర్చి ఏరోజు ఏ వంటకం అందించాలో మెనూ ప్రకారం బడిలో పిల్లలకు పక్కాగా పెడుతున్నారు. స్కూళ్లల్లో పిల్లలకు రుచికరమైన పౌష్టికాహారం అందుతోంది. దీంతో విద్యార్థుల హాజరు శాతం కూడా పెరిగింది.

గోరుముద్దకు బడ్జెట్‌లో భారీగా కేటాయింపు 
గత ప్రభుత్వ హయాంలో మధ్యాహ్న భోజ­న ఏజెన్సీలకు ఏనాడు సకాలంలో డబ్బులు చెల్లించ లేదు. 2014–2018 వరకు బడుల్లో అసలు వంటపాత్రల సరఫరా లేదు. అసలు ఈ పథకానికి బడ్జెట్‌లో నిధు­లు కేటాయింపే అరకొరగా ఉండేవి.

2014–2018 మధ్య పిల్లల భోజనానికి చేసిన సగటు వ్యయం కేవలం రూ. 450 కోట్లు మాత్రమే. ప్రస్తుతం ప్రభుత్వ హయా­ంలో ఇప్పటి వరకూ బడ్జెట్‌ కేటాయింపులు రూ. 7,244 కోట్లకు పైగా ఉన్నాయంటే పేద పిల్లల ఆహారం విషయంలో ప్రభుత్వం ఎంత ఉన్నతంగా ఆలోచిస్తోందో అర్థమవుతుంది. ఈ విషయం రాష్ట్ర ప్రజలకు తెలిసినా రామోజీకి మాత్రం తెలియ­నట్లు నటించడం విచారకరం.

ఈ ఏడాది అన్ని పాఠశాలల్లో 37,63,698 మంది విద్యార్థులకు గ్లాసులు అందించారు. వంట పాత్ర­లు కొనుగోలు పూర్తి చేశారు. వీటిని సెపె్టంబర్‌ నెలాఖరులోగా అన్ని స్కూళ్లకు అందించనున్నారు. 2023–24లో బడ్జెట్‌లో రూ. 1,689 కోట్లు గోరుముద్ద కోసం ప్రభుత్వం కేటాయించింది. వంట ఖర్చు, అదనపు మెనూ, ఆహార ధాన్యాలు, రవాణాతో సహా మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.

వంట ఖర్చు పెంపు 
గత ప్రభుత్వంలో 2014–18 మధ్య విద్యార్థుల వంట ఖర్చు రూ. 3.59 నుంచి రూ. 6.51 మధ్య మాత్రమే కేటాయించారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ ఖర్చును రూ. 8.57 పెంచి చెల్లిస్తోంది. నిబంధనల ప్రకారం పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న కేంద్రీకృత కిచెన్‌ ఏజెన్సీలకు వంట ఖర్చు కూడా క్రమం తప్పకుండా ప్రభుత్వం చెల్లిస్తోంది. వంట చేసే కుక్‌/హెల్పర్స్‌ గౌరవ వేతనాన్ని సైతం క్రమం తప్పకుండా ప్రతి నెలా నేరుగా వారి ఖాతాల్లోనే జమచేస్తోంది. ఈ చెల్లింపులు జూన్‌ నెల వరకు పూర్తి చేశారు.

ప్రస్తుతం మెనూ ఇలా..  
సోమవారం: వేడి పొంగల్, ఉడికించిన గుడ్డు లేదా వెజిటబుల్‌ పులావ్, గుడ్డు కూర, చిక్కీ 
♦ మంగళవారం: చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు, రాగిజావ 
♦ బుధవారం: వెజిటబుల్‌ అన్నం, ఆలూకుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ 
♦ గురువారం: సాంబార్‌బాత్‌/నిమ్మ­కాయ పులిహోర, టమాటా పచ్చడి, ఉడికించిన గుడ్డు, రాగిజావ 
♦ శుక్రవారం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ 
♦ శనివారం: ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్‌ పొంగల్, రాగిజావ

Advertisement

What’s your opinion

Advertisement