A.P. CID Searches Ex-Minister Narayana Family Members House HYD - Sakshi
Sakshi News home page

అమరావతి భూముల దర్యాప్తులో సీఐడీ చేతికి కీలక ఆధారాలు

Feb 25 2023 10:26 AM | Updated on Feb 25 2023 2:40 PM

AP CID Searches Ex Minister Narayana Family Members House HYD - Sakshi

అమరావతి భూముల దర్యాప్తులో సీఐడీ చేతికి కీలక ఆధారాలు లభించాయి. హైదరాబాద్‌లోని నారాయణ కూమార్తెలు, బంధువుల ఇళ్లల్లో జరిపిన సోదాల్లో ఆడియో క్లిప్‌ లభించింది.

సాక్షి, హైదరాబాద్‌: అమరావతి భూముల దర్యాప్తులో సీఐడీ చేతికి కీలక ఆధారాలు లభించాయి. హైదరాబాద్‌లోని నారాయణ కూమార్తెలు, బంధువుల ఇళ్లల్లో జరిపిన సోదాల్లో ఆడియో క్లిప్‌ లభించింది. నారాయణ, ఆయన కుమార్తె మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ఇందులో మనీ రూటింగ్ ఎలా చేయాలో కుమార్తెకు నారాయణ వివరించినట్లు సమాచారం. దీని ప్రకారమే మనీ రూటింగ్‌... తద్వారా అమరావతిలో భూములు కొనుగోలు జరిగినట్లు ఆడియో క్లిప్‌ ద్వారా తెలుస్తోంది.

కాగా, మాజీ మంత్రి నారాయణ కుటుంబ సభ్యుల నివాసాల్లో రెండో రోజు ఏపీ సీఐడీ అధికారుల సోదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని మీనాక్షి బాంబుస్‌, కొండాపూర్‌లోని కోళ్ల లగ్జరియా విల్లాస్‌లోని నారాయణ, ఆయన కుమార్తెల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు అధికారులు. అమరావతి భూముల కొనుగోళ్లకు సంబంధించి సీఐడీ నమోదు చేసిన కేసుల దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరుగుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement