మోటార్ కోసం వెళ్లి వాగులో చిక్కుకున్న రైతులు

ఇద్దరు రైతులను రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ బలగాలు
సాక్షి, చిత్తూరు: పొలంలో మోటార్ కోసం వెళ్లి ముగ్గురు రైతులు వాగులో చిక్కుకున్నారు. వారిలో ఇద్దరు రైతులను ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రక్షించాయి. గల్లంతు అయిన మరో రైతు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా మల్లెమడుగు రిజర్వాయర్ నిండిపోవడంతో నీటి ఉధృతి పెరిగి ప్రాణాపాయ స్థితిలో పడ్డారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం డిక్షన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు,ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక దళ సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. నివర్ తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. (చదవండి: తీరాన్ని దాటిన నివర్ తుపాను..)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి