ధారమఠం.. భక్తజన సందోహం | - | Sakshi
Sakshi News home page

ధారమఠం.. భక్తజన సందోహం

Feb 16 2026 7:47 AM | Updated on Feb 16 2026 7:47 AM

ధారమఠం.. భక్తజన సందోహం

ధారమఠం.. భక్తజన సందోహం

గొలుగొండ: ప్రముఖ శైవక్షేత్రం ధారమఠం శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా సోమవారం శివనామస్మరణతో మారుమ్రోగింది. వేలాదిగా భక్తులతో కిటకిటలాడింది. సత్యసాయి ట్రస్టు సభ్యులు భక్తులకు అల్పాహారం, మజ్జిగ అందజేశారు. చోద్యం యూత్‌ సభ్యులు ప్రత్యేకంగా 500 లీటర్ల పెరుగుతో మజ్జిగ పంపిణీ చేశారు. కృష్ణదేవిపేట గ్రామంలో నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. చీడిగుమ్మల కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయాన్ని కూడా భక్తులు పెద్ద ఎత్తున సందర్శించారు. భారమఠంలో సోమవారం రాత్రి మహా రుద్రాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నర్సీపట్నం రూరల్‌ సీఐ రేవతమ్మ, గొలుగొండ ఎస్‌ఐ రామారావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement