అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయాలి | - | Sakshi
Sakshi News home page

అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయాలి

Feb 16 2026 7:47 AM | Updated on Feb 16 2026 7:47 AM

అక్రమ మైనింగ్‌కు  అడ్డుకట్ట వేయాలి

అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయాలి

సీపీఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు

సమావేశంలో మాట్లాడుతున్న

సీపీఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు

అనకాపల్లి: జిల్లాలో అక్రమమైనింగ్‌్‌కు అధికారులు అడ్డుకట్టవేయడంతో పాటు అక్రమంగా ఏర్పాటు చేసిన మైనింగ్‌ చెక్‌పోస్టులను ఎత్తివేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ రహదారి పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఒక్క అనకాపల్లి మండలంలోనే రోజుకు 500 పైగా లారీలతో రాంబిల్లి మండలంలో పోర్టుకు (ఎన్‌వోబి), ఇతర ప్రాంతాలకు పిక్కతోపాటు ఇతర మెటీరియల్‌ సప్లై జరుగుతోందని చెప్పారు. దీనిపై మైనింగ్‌, విజిలెన్స్‌, రవాణాశాఖ, రెవెన్యూ, పోలీస్‌ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం పక్కతోవ పడుతోందని చెప్పారు. మండలంలో మార్టూరు జంక్షన్‌ వద్ద ఎ.ఎం.ఆర్‌ సంస్థ అక్రమంగా చేక్‌ పోస్టు పెట్టడంతో ప్రమాదాలు జరుగుతూ ప్రజలు ప్రాణాలు పోతున్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఏఎంఆర్‌ సంస్థ ద్వారా స్థానిక ఎంపీ సీఎం రమేష్‌ అనుచరులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, మైనింగ్‌శాఖకు సంబంధించిన బోర్డులు పెట్టి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో దశలువారీగా జిల్లా వ్యాప్తంగా స్థానిక ప్రజలు సహాకారంతో ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రుత్తల శంకరరావు, గంటా శ్రీరామ్‌, అల్లు రాజు, కాళ్ళ తేలయ్యబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement