సింహగిరిపై మల్టీలెవల్ కారు పార్కింగ్‌కు స్థల పరిశీలన
సింహాచలం: సింహాచల పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల పార్కింగ్ ఇబ్బందులను తొలగించేందుకు దేవస్థానం కీలక అడుగు వేసింది. కొండపైకి వచ్చే కార్ల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో, అత్యాధునిక ‘మల్టీ లెవల్ కార్ పార్కింగ్’ ఏర్పాటుకు సంకల్పించింది. ఈ మేరకు ఆదివారం దేవస్థానం ఈవో జె.వెంకటరావు, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి సింహగిరిపై పాదాలమ్మ, బంగారమ్మ ఆలయాల ప్రాంగణంలో స్థల పరిశీలన చేశారు. ఈ ప్రాంగణంలో గరిష్టంగా ఎన్ని కార్లను పార్క్ చేయవచ్చనే అంశంపై సాంకేతిక నిపుణులతో చర్చించారు. కార్యక్రమంలో దేవస్థానం డీఈ హరి, ఏఈ రవిరాజు, సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు.


