మత్స్యలింగేశ్వరునికి నీరాజనం | - | Sakshi
Sakshi News home page

మత్స్యలింగేశ్వరునికి నీరాజనం

Feb 16 2026 7:45 AM | Updated on Feb 16 2026 7:45 AM

మత్స్

మత్స్యలింగేశ్వరునికి నీరాజనం

సాక్షి, పాడేరు/హుకుంపేట: గిరిజన ప్రాంతంలో అత్యంత మహిమాన్విత పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న హుకుంపేట మండలంలోని మత్స్యగుండం, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తజన సంద్రమైంది. ఆదివారం జాతర రెండో రోజు కావడంతో దండకారణ్య పరివాహక రాష్ట్రాల గిరిజనులతో పాటు, మైదాన ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. అటు ఆధ్యాత్మిక కేంద్రంగా, ఇటు పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందిన ఈ క్షేత్రం ’హరహర మహాదేవ’ శంభో శంకర’ నామస్మరణతో మారుమోగింది.

భక్తుల పరవశం : వేకువజాము నుంచే భక్తులు ప విత్ర స్నానాలు ఆచరించి, గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండి మత్స్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక అభిషేకాలు, పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

సజీవ దైవాలుగా మత్స్యదేవతలు

ఈ క్షేత్రంలోని ప్రధాన ఆకర్షణ, ఆధ్యాత్మిక విశిష్టత ఇక్కడి మత్స్యదేవతలు (చేపలు). స్వామివారి దర్శనం అనంతరం భక్తులంతా దిగువన ఉన్న మత్స్యగెడ్డ సెలయేరు ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ మత్స్యగుండంలో సంచరించే చేపలను దేవతా స్వరూపాలుగా భావించి, క్యూలైన్లలో వెళ్లి వాటిని దర్శించుకుని పులకించిపోయారు.భక్తుల సౌకర్యార్థం పాడేరు ఆర్టీసీ డిపో ప్రత్యేకంగా 20 బస్సులను నడపడం పట్ల యాత్రికులు హర్షం వ్యక్తం చేశారు. జాతరలో వెలిసిన దుకాణాలు, వినోద కార్యక్రమాల వద్ద రద్దీ కొనసాగింది. ఇన్‌చార్జి జేసీ, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, పాడేరు డీఎస్పీ అభిషేక్‌ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సీఐ అప్పలనాయుడు ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

మత్స్యదేవతల చెంతకు భక్తజన ప్రవాహం

మత్స్యగుండంలో మారుమోగిన

శివనామస్మరణ

ఘనంగా శివరాత్రి ఉత్సవాలు

మత్స్యలింగేశ్వరునికి నీరాజనం1
1/3

మత్స్యలింగేశ్వరునికి నీరాజనం

మత్స్యలింగేశ్వరునికి నీరాజనం2
2/3

మత్స్యలింగేశ్వరునికి నీరాజనం

మత్స్యలింగేశ్వరునికి నీరాజనం3
3/3

మత్స్యలింగేశ్వరునికి నీరాజనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement