జాతరకు ప్రత్యేక బస్సులు | - | Sakshi
Sakshi News home page

జాతరకు ప్రత్యేక బస్సులు

Feb 14 2026 7:49 AM | Updated on Feb 14 2026 7:49 AM

జాతరకు ప్రత్యేక బస్సులు

జాతరకు ప్రత్యేక బస్సులు

భక్తుల సౌకర్యార్థం పాడేరు డిపో మేనేజర్‌ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 20 ప్రత్యేక బస్సులు కేటాయించారు. ఈ నెల 14 నుంచి పాడేరు పాత బస్టాండ్‌ నుంచి రెండు బస్సులు అందుబాటులో ఉంటాయి. ఈనె 15 వ తేదీ నుంచి పాడేరుతో పాటు అరకులోయ, చింతపల్లి, ముంచంగిపుట్టు రూట్లలో అన్ని బస్సులు మత్స్యగుండం క్షేత్రానికి సర్వీసులు అందిస్తాయి.

● పాడేరు పట్టణంలోని సుండ్రుపుట్టు సాయిబాబా గుడి, మెయిన్‌ రోడ్డు, పాత బస్టాండ్‌, సినిమా హాల్‌ సెంటర్‌ మరియు ఆర్టీసీ కాంప్లెక్స్‌ ప్రాంతాల నుంచి బస్సులు నడుస్తాయి.

● మూడు రోజుల పాటు భక్తులు మత్స్యదేవతలను (చేపలను) సందర్శించుకునేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement