పీజేఆర్‌ఎస్‌కు వినతుల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

పీజేఆర్‌ఎస్‌కు వినతుల వెల్లువ

Feb 14 2026 7:49 AM | Updated on Feb 14 2026 7:49 AM

పీజేఆర్‌ఎస్‌కు వినతుల వెల్లువ

పీజేఆర్‌ఎస్‌కు వినతుల వెల్లువ

109 అర్జీలు స్వీకరణ

సాక్షి,పాడేరు: స్థానిక ఐటీడీఏలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థకు వినతులు వెల్లువెత్తాయి. జిల్లాలోని అనేక ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ వ్యక్తిగత,గ్రామాల సమస్యలపై 109 అర్జీలను కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌కు అందజేశారు.ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నిశాఖల అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.అలాగే జిల్లా ప్రజలు తమ సమస్యలు పరిష్కారం కాని పక్షంలో 1100 కాల్‌సెంటర్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి జేసీ తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, ఇన్‌చార్జి డీఆర్వో అంబేద్కర్‌, ఇన్‌చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement