అందుబాటులో ఆధార్ సేవలు
● కలెక్టర్ దినేష్‌కుమార్
సాక్షి,పాడేరు: జిల్లాలోని ప్రతి గ్రామ సచివాలయాలు, పోస్టాపీసుల్లో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాలలో అర్హులైన ప్రజలందరికి ఆధార్ సేవలు కల్పించాలని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు.తన కార్యాలయంలో శుక్రవారం కలెక్టర్ జిల్లాస్థాయి ఆధార్ మానటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆధార్ కేంద్రం వద్ద సర్వీస్ చార్జీల వివరాల బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.అంగన్‌వాడీ కేంద్రాలు, విద్యాలయాల్లో బయోమెట్రిక్ నవీకరణ శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా సేవలు అందించాలన్నారు. వందేళ్లు పైబడిన వృద్ధులకు కూడా ఆధార్ నవీకరణ చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఎల్పీవో కుమార్,పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.


