బాల్య వివాహాలను నిర్మూలిద్దాం | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాలను నిర్మూలిద్దాం

Feb 14 2026 7:49 AM | Updated on Feb 14 2026 7:49 AM

బాల్య వివాహాలను నిర్మూలిద్దాం

బాల్య వివాహాలను నిర్మూలిద్దాం

సాక్షి,పాడేరు: జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ ఆదేశించారు. ఐసీడీఎస్‌, సీడ్‌ సంస్థలు సమకూర్చిన బాల్య వివాహాల విముక్తి ప్రచార రథంను ఆయన ఐటీడీఏ ప్రాంగణంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు జరిపినా, ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడ బాల్య వివాహాలు జరిగినా 100, 112, 1098, 18001027222 నంబర్లకు ప్రజలు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, ఇన్‌చార్జి డీఆర్వో అంబేద్కర్‌, ఇన్‌చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement