అరకు వారపు సంతపైడ్రోన్ నిఘా
డుంబ్రిగుడ: అరకులో శుక్రవారం జరిగిన జిల్లాలోనే అతిపెద్ద వారపు సంతపై పోలీసులు డ్రోన్ సహాయంతో నిఘా పెట్టారు. ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు ఎస్‌ఐ సురేష్ తన సిబ్బందితో కలిసి సంత ప్రాంతాన్ని పర్యవేక్షించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేశారు.ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల నుంచి వ్యాపారులు భారీగా వస్తుండటంతో, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిఘా పెంచారు.గంజాయి, నాటుసారా వంటి మత్తు పదార్థాల రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.
అరకు వారపు సంతపైడ్రోన్ నిఘా


