మందుబాబులను పట్టేసిన డ్రోన్ కెమెరా
మద్యం సేవిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సీఐ రేవతమ్మ, ఎస్సై రాజారావు
నర్సీపట్నం : నర్సీపట్నం మండలం, నెల్లిమెట్ట జంక్షన్ నుండి బుచ్చంపేట వెళ్లే మార్గంలో సీఐ ఎల్.రేవతమ్మ పర్యవేక్షణలో గురువారం డ్రోన్ కెమెరా ఎగురవేశారు. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ఐదుగురు వ్యక్తులను డ్రోన్ కెమెరా పట్టేసింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టు సీఐ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం డ్రోన్ నిఘా ఉంటుందన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ రాజారావు, సిబ్బంది పాల్గొన్నారు.


