6 కిలోల గంజాయితో ఇద్దరు అరెస్టు
గంజాయితో పట్టుబడిన వ్యక్తులతో పోలీసులు
కోటవురట్ల : గంజాయి అక్రమ రవాణా చేస్తూ ఇద్దరు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. ఎస్‌ఐ రమేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గంజాయిని తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో మండలంలోని యండపల్లి వద్ద పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. బ్యాగుతో ఇద్దరు అపరిచిత వ్యక్తులు కనిపించడంతో వారిని తనిఖీ చేయగా 6 కిలోల గంజాయి పట్టుబడింది. ఇక్కడి నుంచి ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తులు నంధ్యాల జిల్లా సుంకేసుల గ్రామానికి చెందిన కుమ్మరి దస్తగిరి, తలారి సుబ్బ రామయ్య గుర్తించి వారి నుంచి మొబైల్ ఫోన్, 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగ కమిటీల్లో ఇద్దరికి చోటు


