 
							భద్రాచలం: రెండు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తజనం.. ఓ పక్క తలంబ్రాల తయారీలో మహిళల ఆనందోత్సవాలు.. మరోపక్క వసంతోత్సవంతో శుక్రవారం భద్రగిరి సందడిగా మారింది
 
							శ్రీరామనవమికి భద్రాచలంలో జరిగే శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి పౌర్ణమి రోజు సంప్రదాయ బద్ధంగా పసుపు కొమ్ములు దంచడం ఆనవాయితీగా వస్తోంది
 
							మిథిలా స్టేడియం, వైకుంఠ ద్వారం వద్ద ఈ కార్యక్రమాలు చేపట్టారు
 
							తొలుత పల్లకీసేవగా స్వామి ఉత్సవమూర్తులను ఉత్తర ద్వారం వద్దకు తీసుకొచ్చాక అర్చకులు స్వామి వారితో పాటు రోళ్లు, రోకళ్లకు పూజలు చేశారు.
 
							అనంతరం ఆలయ ఈఓ రమాదేవి, అర్చకుల, పండితుల సతీమ ణులతో పసుపు కొమ్ములు దంచడంతో పాటు బియ్యంలో పసుపు కలిపి తలంబ్రాలు సిద్ధం చేశారు
 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							 
							
 
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
