దర్శకుడి ఇంట్లో కోటి రూపాయలు చోరీ | Over Rs.1 crore stolen from Satish Kaushik's residence | Sakshi
Sakshi News home page

దర్శకుడి ఇంట్లో కోటి రూపాయలు చోరీ

May 19 2014 3:22 PM | Updated on Aug 29 2018 7:09 PM

దర్శకుడి ఇంట్లో కోటి రూపాయలు చోరీ - Sakshi

దర్శకుడి ఇంట్లో కోటి రూపాయలు చోరీ

బాలీవుడ్ దర్శకుడు, నటుడు సతీష్ కౌశిక్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. 1.2 కోట్ల రూపాయలుపైగా చోరీ అయ్యాయి.

ముంబై: బాలీవుడ్ దర్శకుడు, నటుడు సతీష్ కౌశిక్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. 1.2 కోట్ల రూపాయలుపైగా చోరీ అయ్యాయి. ఈ మేరకు సతీష్ కౌశిక్, ఆయన భార్య ఆదివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో వెర్సోవా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తన క్రియేటిక్ వర్క్ కోసం ఈ డబ్బు తెచ్చానని, సోమవారం బ్యాంకులో వేద్దామనుకునేలోపు చోరీకి గురయ్యిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సతీష్ కౌశిక్ పనిమనిషి సాజన్ కుమార్ను పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగతనం జరిగిన నాటి అతడు కనిపించకపోవడంతో అనుమానాలకు బలమిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement