ముజఫర్నగర్లో 16న ప్రధాని పర్యటన | Muzaffarnagar: Prime minister Manmohan singh, Akhilesh to visit riot-hit areas | Sakshi
Sakshi News home page

ముజఫర్నగర్లో 16న ప్రధాని పర్యటన

Sep 14 2013 1:20 PM | Updated on Sep 1 2017 10:43 PM

మత ఘర్షణలతో అట్టుడికిన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌ నగర్‌లో ఈ నెల 16న ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పర్యటించనున్నారు.

ముజఫర్ నగర్ : మత ఘర్షణలతో అట్టుడికిన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌ నగర్‌లో ఈ నెల 16న ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పర్యటించనున్నారు. యూపిఏ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ కూడా మన్మోహన్‌తో కలిసి పర్యటించవచ్చని సమాచారం. అలాగే ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా పర్యటించనున్నారు.  ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ముజఫర్‌ నగర్‌లో కర్ఫ్యూ సడలించారు.

మహా పంచాయితీ పేరుతో రెండు వర్గాల వారు సమావేశం కాబోతుండగా కొందరు రాళ్ళ దాడి జరపడంతో అల్లర్లు మొదలయ్యాయి. క్రమంగా విస్తరించడంతో ముజఫర్‌ నగర్‌లో 40 మందికి పైగా చనిపోయారు. 80 మంది గాయపడ్డారు. 300 మందిని అరెస్ట్‌ చేశారు. నలుగురు బిజెపి ఎమ్మెల్యేలు, ఓ కాంగ్రెస్‌ ఎంపీపై కేసులు బుక్‌ చేశారు. అఖిలేష్‌ సర్కారు అల్లర్లను అదుపుచేయలేకపోయిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement