వెంకయ్య నాయుడు హెలికాప్టర్ ను తగులబెట్టిన కేసుతో సంబంధమున్న పరాస్ యాదవ్ అనే మావోయిస్టును బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు.
గయా(బీహార్): బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు హెలికాప్టర్ ను తగులబెట్టిన కేసుతో సంబంధమున్న పరాస్ యాదవ్ అనే మావోయిస్టును బీహార్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. గయా జిల్లాలోని నవాదిహ్ గ్రామంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు సబ్ డివిజనల్ పోలీసు అధికారి తెలిపారు.
2005లో ఎన్నికల ప్రచారం సందర్భంగా అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గయా జిల్లాలోని పరారియా గ్రామంలో మిడిల్ స్కూల్ పాఠశాల ప్రాంగణంలో అత్యవసరంగా దిగింది. తర్వాత ఆయన రోడ్డు మార్గం ద్వారా గమ్యానికి చేరుకున్నారు. ఈ హెలికాప్టర్ ను మావోయిస్టులు తగులబెట్టారు.