మోదీ కనుసన్నల్లో సీబీఐ: మమత | CBI is PM's department, says mamata banerjee | Sakshi
Sakshi News home page

మోదీ కనుసన్నల్లో సీబీఐ: మమత

Apr 12 2015 7:12 PM | Updated on Sep 3 2017 12:13 AM

మోదీ కనుసన్నల్లో సీబీఐ: మమత

మోదీ కనుసన్నల్లో సీబీఐ: మమత

కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కనుసన్నల్లో నడుస్తోందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.

కోల్ కతా: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కనుసన్నల్లో నడుస్తోందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. సీబీఐ ప్రధానమంత్రి విభాగం(పీఎం డిపార్ట్ మెంట్)గా మారిందని విమర్శించారు. ప్రధాని ఆదేశాల మేరకే సీబీఐ నడుస్తోందని మండిపడ్డారు.

ఆదాయానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సీబీఐ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై పోరాడుతున్నందునే తమ పార్టీపైకి సీబీఐని ఉసిగొల్పిందని అన్నారు. ఏ ఇతర పార్టీకి సీబీఐ నోటీసు ఇవ్వలేదని మమత తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement