కటౌట్‌తో సహజీవనం | bradley cooper cut out | Sakshi
Sakshi News home page

కటౌట్‌తో సహజీవనం

Jul 3 2014 11:24 AM | Updated on Sep 2 2017 9:46 AM

కటౌట్‌తో సహజీవనం

కటౌట్‌తో సహజీవనం

హాలీవుడ్ నటుడు బ్రాడ్లీ కూపర్ అంటే డానియెల్లీ అనే మహిళకు పిచ్చి అభిమానం.

లండన్: హాలీవుడ్ నటుడు బ్రాడ్లీ కూపర్ అంటే డానియెల్లీ అనే మహిళకు పిచ్చి అభిమానం. ఎంత అభిమానమంటే.. ఆ నటుడి నిలువెత్తు కటౌట్‌ను కార్డ్‌బోర్డుతో తయారు చేయించుకుని.. భర్త, ఇద్దరు పిల్లలతో పాటు ఆ కటౌట్‌నీ తమ కుటుంబంలో ఒక భాగంగా భావించేంత. ఆమె భర్త ఎడ్డీ సహా ఆమె కుటుంబమంతా బ్రాడ్లీని (ఆ కటౌట్‌ని) ప్రాణమున్న వ్యక్తిలానే భావిస్తుంటారు. జాగింగ్, తోటపని, వంటపని, షాపింగ్ లాంటి రోజువారీ పనులు కూడా వారంతా కలిసే చేసుకుంటుంటారు. బ్రాడ్లీకి డానియెల్లీ పుస్తకాలు కూడా చదివి వినిపిస్తుంటుంది. ఇంకా వివరాలు కావాలంటే mylifewithbradleycooper.com చూడండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement