ఉద్యోగం కోసం టవరెక్కి హల్‌చల్‌ | Young Man Suicide Attempt For Job | Sakshi
Sakshi News home page

ఉద్యోగం కోసం టవరెక్కి హల్‌చల్‌

Dec 29 2018 11:57 AM | Updated on Dec 29 2018 11:57 AM

Young Man Suicide Attempt  For Job - Sakshi

సిమెంట్‌ ఫ్యాక్టరీలో  టవర్‌ఎక్కిన  రాజు

తాండూరు రూరల్‌: తెలంగాణ–కర్ణాటక సరిహద్దులో ఉన్న చెట్టినాడు సిమెంట్‌ ఫ్యాక్టరీలో ఓ భూ నిర్వాసితుడు హల్‌చల్‌ చేశాడు. తాండూరు మండలం సంగెంకలాన్‌ గ్రామానికి చెందిన ఎరుకలి రాజు శుక్రవారం చెట్టినాడు ఫ్యాక్టరీలో ఉన్న ఓ టవర్‌ ఎక్కాడు. చెట్టినాడు సిమెంట్‌ ఫ్యాక్టరీ నిర్మాణం కొరకు రాజుకు సంబంధించిన పొలంను అమ్మాడు. ఆ సమయంలో ఆయనకు ఉద్యోగం కల్పిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. కొన్ని సంవత్సరాలు తర్వాత ఉద్యోగం ఇవ్వలేదు.

దీంతో శుక్రవారం అతడు ఫ్యాక్టరీలో ఉన్న టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. ఉద్యోగం ఇస్తానని హామీ ఇస్తే తప్పా టవర్‌ దిగనని చెప్పారు. దీంతో కంపనీ ప్రతినిధులు ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడంతో టవర్‌ దిగారు. అనంతరం తాండూరు జెడ్పీటీసీ రవిగౌడ్‌ కంపనీకి చేరుకుని భూ నిర్వాసితుడితో మాట్లాడారు. అనంతరం అతడికి ఉద్యోగం కల్పించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement