రజనీకాంత్‌కు యంగ్‌లీడర్స్‌ మ్యాగజైన్‌ అందజేత | Young Leaders Magazine To Rajinikanth | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌కు యంగ్‌లీడర్స్‌ మ్యాగజైన్‌ అందజేత

Jul 16 2018 8:50 AM | Updated on Aug 1 2018 2:29 PM

Young Leaders Magazine To Rajinikanth - Sakshi

రజనీకాంత్‌కు మ్యాగజైన్‌ను అందిస్తున్న పైలట్‌ రోహిత్‌రెడ్డి  

తాండూరు టౌన్‌ : యంగ్‌లీడర్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రచురితమైన మ్యాగజైన్‌ను ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు పైలట్‌ రోహిత్‌రెడ్డి ఆదివారం సినీ హీరో రజనీకాంత్‌కు అందజేశారు. యంగ్‌లీడర్స్‌ ఫౌండేషన్‌కు సంబంధించిన ఆడియో సీడీని సైతం మొట్టమొదటిగా రజనీకాంత్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా పైలట్‌ రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ సమాజ సేవే లక్ష్యంగా స్థాపితమైన యంగ్‌లీడర్స్‌ సంస్థ పలు కార్యక్రమాలతో ప్రజలకు చేరువయిందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు.

సంస్థకు సంబంధించిన ఆడియో, మ్యాగజైన్‌ను రజనీకాంత్‌కు అందజేసి, సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించామన్నారు. సేవా కార్యక్రమాలతో ప్రజల మనసుల్లో చిరకాలం నిలవాలని రజనీకాంత్‌ ఆశీర్వదించినట్లు పైలట్‌ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement