ఆర్టీసీ సమ్మె: వేతనాల కేసును ఈ నెల 19కి వాయిదా

TSRTC Strike: High Court Postponed Its Verdict On 19th November - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైకోర్టులో సాగుతున్న విచారణ మరోసారి వాయిదా పడింది. ఆర్టీసీ కార్మికుల వేతనాల కేసును ఈ నెల 19కి వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. అనంతరం ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తన వాదనలు వినిపిస్తూ.. 5100 రూట్లను ప్రైవేటీకరణ చేస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని  సీల్డ్‌ కవర్‌లో కోర్టుకు సమర్పించింది. ప్రజాప్రయోజనాల కోసం తీసుకున్న కేబినెట్ నిర్ణయాన్ని ఎందుకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. అది కేవలం కేబినెట్‌ నిర్ణయం కాబట్టే ప్రజలకు అందుబాటులోకి తేలేదని, జీవో అయ్యాక అందరికి అందుబాబులో ఉంచుతామని ప్రభుత్వం సమాధానమిచ్చింది. అనంతరం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top