జూన్ 21న తెలుగు,తమిళ తారల క్రికెట్ మ్యాచ్ | Tollywood, Kollywood stars' cricket match on June 21 | Sakshi
Sakshi News home page

జూన్ 21న తెలుగు,తమిళ తారల క్రికెట్ మ్యాచ్

Apr 30 2015 7:42 PM | Updated on Aug 28 2018 4:30 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు చేయూతను అందించేందుకు తెలుగు, తమిళ సినీనటులు ముందుకొచ్చారు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు చేయూతను అందించేందుకు తెలుగు, తమిళ సినీనటులు ముందుకొచ్చారు. గురువారం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిసి తమ కార్యాచరణను వివరించారు. అవసరమైన నిధులు సమకూర్చేందుకు జూన్ 21న ఎల్‌బీ స్టేడియంలో తెలుగు, తమిళ సినీ నటులతో క్రికెట్ మ్యాచ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల రూపాయల వరకు సమకూరుతుందని అంచనా. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తామని ప్రతినిధి బృందం ప్రకటించింది. ఈ క్రికెట్ మ్యాచ్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు బహుమతి ప్రధానోత్సవంలో పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement