
కారులో వెళ్తున్న దంపతులు... వెంబడించిన పోకిరీలు
హైదరాబాద్ నగర శివారుల్లో కీచక పర్వం కొనసాగుతుంది. రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డు రహదారిపై గత అర్థరాత్రి ఓ జంట కారులో వెళ్తుంది.
హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారుల్లో కీచక పర్వం కొనసాగుతుంది. రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డు రహదారిపై గత అర్థరాత్రి దంపతులు కారులో వెళ్తున్నారు. ఆ విషయాన్ని గమనించిన ముగ్గురు అకతాయి యువకులు బైకులపై కారును వెంబడించారు. కారును ఛేజ్ చేసి... రోడ్డుకు అడ్డంగా బైకులు ఉంచి... కారులోని యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. దాంతో కారులోని జంట 100 నెంబర్ డైల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని స్టేషన్కు తరలించారు. నిందితులు ముఖేష్, ప్రవిణ్, నవదీప్లు అని పోలీసులు తెలిపారు. వీరంతా ఓటర్ రింగ్ రోడ్డు స్టాఫ్గా భావిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితలను తమదైన శైలిలో విచారిస్తున్నారు.