అప్పుడు ఇస్తాంబుల్....ఇప్పుడు డల్లాస్ అట! | shabbir ali takes on telangana cm kcr | Sakshi
Sakshi News home page

అప్పుడు ఇస్తాంబుల్....ఇప్పుడు డల్లాస్ అట!

Jan 3 2015 12:51 PM | Updated on Sep 4 2018 5:07 PM

అప్పుడు ఇస్తాంబుల్....ఇప్పుడు డల్లాస్ అట! - Sakshi

అప్పుడు ఇస్తాంబుల్....ఇప్పుడు డల్లాస్ అట!

ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఏడు నెలల పాలనలో కేసీఆర్...వారానికి ఒక వాగ్దానం

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఏడు నెలల పాలనలో కేసీఆర్...వారానికి ఒక వాగ్దానం చేశారని, అయితే ఆయన ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. హైదరాబాద్ను అప్పట్లో ఇస్తాంబుల్ చేస్తానన్న...కేసీఆర్ ఇప్పుడు డల్లాస్ అంటున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ 20కి పైగా ఇచ్చిన హామీల్లో ఒక్కటీ ప్రారంభం కాలేదని విమర్శించారు. కేసీఆర్ ...హైదరాబాద్ హామీల అమలుకు రెండు లక్షల కోట్లు అవసరం అన్నారు.

కాగా నిజాంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను షబ్బీర్ అలీ సమర్థించారు. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో నిజాం పాలన ప్రశంసనీయమన్నారు. హైదరాబాద్లో ఆస్పత్రులన్నీ నిజాం హయాంలో నిర్మించినవే అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement