‘కాపలా లేని రైల్వే గేట్లను ఎత్తేస్తాం’

Safety Of Passengers Is Our Aim South Central Railway GM Vinod Kumar - Sakshi

సాక్షి, హైదరాబాద్/సికింద్రాబాద్‌: దక్షిణ మధ్య రైల్వేలో ప్రయాణికుల భద్రత విషయంలో రాజీలేకుండా పని చేస్తున్నామని జీఎం వినోద్‌కుమార్‌ అన్నారు. ప్రమాదాలను గణనీయంగా తగ్గించడానికి ప్రయాత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బుధవారం ఆయన కార్యాలయంలో మీడియతో మాట్లాడారు. 6 నెలలుగా ప్రమాదాల నివారణకు నిర్విరామంగా పనులు సాగుతున్నాయని తెలిపారు. ప్రమాదాల సంఖ్య 116 నుంచి 73కు తగ్గిందని అన్నారు. దక్షిణ మధ్య రైల్వేను జీరో ప్రమాదాల స్థాయికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు..

గతేడాది 200, ఈ ఏడాది 300 కిలో మీటర్లు నూతనంగా ట్రాక్‌ల నిర్మాణం చేపట్టామన్నారు. తద్వారా ఎక్కువ సర్వీసులను నడిపి వెయిటింగ్‌ లిస్టు లేకుండా చేసే దిశగా ముందడుగు వేశామన్నారు. కాపలా లేని రైల్వే గేట్లను జీరో స్థాయికి తీసుకొస్తామని అన్నారు. గతేడాది 136, ఈ ఏడాది 132 కాపలా లేని రైల్వే గేట్లు తొలగించామని తెలిపారు. వచ్చే మూడేళ్లలో మన్మాడ్‌ జోన్‌ను పూర్తి ఎలక్ట్రిక్‌ లైన్‌ జోన్‌గా మారుస్తామన్నారు. సికింద్రాబాద్‌ గణపతి ఆలయం వద్ద మల్టీలెవల్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానానికి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నాని తెలిపారు. రైల్వేలో మౌలిక సదాపాయాల కల్పనకు నిధుల కొరత లేదన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top