ఓబీసీ వర్గీకరణతోనే సరైన న్యాయం | right justice with OBC classification | Sakshi
Sakshi News home page

Oct 2 2017 3:12 AM | Updated on Oct 2 2017 3:12 AM

right justice with OBC classification

సాక్షి, హైదరాబాద్‌: ఓబీసీ వర్గీకరణతోనే వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం అన్నారు. ఆదివారం లక్డీకాపూల్‌లో జరిగిన బీసీ ఉద్యోగుల సంఘం, బీసీ ప్రతినిధుల సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్నాయన్నారు. వర్గీకరణపై త్వరలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, ఇందులో ఓబీసీల డిమాండ్లు స్పష్టం చేయాలని బీసీ సంక్షేమ సంఘానికి సూచించారు.

బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించేందుకు కృషి చేస్తున్నామని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ జనాభాలో బీసీలే అధికంగా ఉన్నారని, వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్న సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement