రోడ్డు ప్రమాదంలో ప్రొఫెసర్ మృతి చెందిన సంఘటన చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది.
చాదర్‌ఘాట్ (హైదరాబాద్): రోడ్డు ప్రమాదంలో ప్రొఫెసర్ మృతి చెందిన సంఘటన చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ సత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం... ముసారాంబాగ్‌కు చెందిన ఎం.కిషన్‌రావు (54) నల్లకుంటలోని ఓ విద్యా సంస్థలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కోఠి నుంచి ముసారాంబాగ్‌కు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా మలక్‌పేట రైల్వే బ్రిడ్జి వద్ద వెనుక నుంచి వస్తున్న వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కిషన్‌రావు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.