రంగారెడ్డి జిల్లాలో విషాదం

One Died In cylinder Blast At ranga Reddy District - Sakshi

సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ మండలం నాన్‌దార్‌ఖన్‌పేట్‌లో గురువారం విషాదం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం టీ పెడుతుండగా ఓ ఇంట్లో సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో మహిళ, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.

ఇంటి నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. గాయపడిన క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top