అంధకారమేనా?

Kanti Velugu Patients Discharged At LV Prasad Hospital - Sakshi

హన్మకొండ చౌరస్తా (వరంగల్‌): కంటి వెలుగు.. వారి జీవితాల్లో చీకట్లను నింపింది. హన్మకొండలోని జయ ఆస్పత్రిలో ఇటీవల జరిగిన ఘటనలో బాధితులకు కంటి చూపు కష్టమే అన్న అనుమానాలు నిజమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం ద్వారా సెప్టెంబర్‌ 26న హన్మకొండలోని జయ ఆస్పత్రిలో జరిగిన ఆపరేషన్లు వికటించిన విషయం తెలిసిందే. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 18 మందికి కంటి శస్త్ర చికిత్సలు చేసిన వైద్యులు.. అందులో 11మందికి సెప్టెంబర్‌ 28న రీఆపరేషన్‌ చేశారు. అయినప్పటికీ చూపు సరిగా లేదని ఆందోళనకు దిగడంతో 18 మంది బాధితులను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్‌ ఆస్పత్రికి తరలించా రు. మూడు రోజులపాటు ఆస్పత్రిలో ఉంచుకున్న ఎల్‌వీ ప్రసాద్‌ వైద్యులు 8మందికి చికిత్స నిలిపివేసి సోమవారం డిశ్చార్జి చేశారు.

మూడు రోజుల తర్వాత మరోసారి ఆస్పత్రికి రావాలని వైద్యులు చెప్పగా.. ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని, హన్మకొండలోని జయ ఆస్పపత్రిలోనే చికిత్స పొందాలని సిబ్బంది చెప్పినట్లు బాధితులు ‘సాక్షి’కి ఫోన్‌లో తెలిపారు. అస్పష్టమైన సమాధానంతో ఆందోళన చెందుతూనే తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఎనిమిది మంది బాధితులు ఇంటి ముఖం పట్టారు. కంటిలో ఇన్ఫెక్షన్‌ అలానే ఉందని, చూపు స్పష్టంగా కనపడడం లేదని, కళ్లు మసగ్గానే కనపడుతున్నాయని బాధితులు వాపోయారు. వైద్యులు మాత్రం పది రోజుల్లో అంతా సర్దుకుంటుంద ని.. కంటి చూపు మెరుగుపడుతుందని చెప్పి పం పినట్లు తెలిపారు. ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

డిశ్చార్జి అయిన బాధితులు
బోలే సరోజన, పులిగిల్ల, పరకాల, కె.సరోజన, మచిలీబజార్, హన్మకొండ, గోరంట్ల సుజాత, పాపయ్యపేటచమన్, వరంగల్‌. ముడిగె రాజయ్య, వేశాలపల్లి, భూపాలపల్లి, బుచ్చమ్మ గోపరాజు,ఎల్లాపూర్, హసన్‌పర్తి. అజ్మీర మేఘ్య, బాంజీపేట, నర్సంపేట. జి.భగవాన్, ధర్మరావుపేట, ఖానాపూర్‌. మంద సత్తమ్మ, న్యూశాయంపేట, హన్మకొండ.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top