హాల్ టికెట్ ఇవ్వలేదనే మనస్తాపంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిన ఘటన వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం వావిలాలలో బుధవారం జరిగింది.
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
మహబూబాబాద్: హాల్ టికెట్ ఇవ్వలేదనే మనస్తాపంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిన ఘటన వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం వావిలాలలో బుధవారం జరిగింది. నెల్లికుదురు మండలం శ్రీరామగిరికి చెందిన ఎడ్ల రాంచంద్రు, మంజులల చిన్న కుమార్తె పావని మహబూబాబాద్‌లోని సోషల్ వెల్ఫేర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్(ఎంపీసీ) చదువుతోంది. తల్లిదండ్రులు మృతి చెందడంతో తాత వద్ద ఉంటోంది. అనారోగ్యం కారణంగా కొన్ని నెలలు కాలేజీకి వెళ్లలేదు. తర్వాత ఎన్విరాన్‌మెం ట్ ప్రాక్టికల్ పరీక్షకు హాజరై.. మళ్లీ ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇంటి వద్దనే ఉంది. వారం క్రితం పెద్దమ్మ కుమారుడితో కలసి కాలేజీకి వెళ్లి హాల్‌టికెట్ అడిగితే ప్రిన్సిపాల్ నిరాకరించారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 7 గంటల వరకు కాలేజీలోనే ఉన్నా ఫలితం లేకపోవడంతో మనస్తాపం చెందింది. వావిలాలలోని పెద్దనాన్న ఇంటికి వెళ్లి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. హాజరులేని కారణంగానే పావనికి హాల్‌టికెట్ ఇవ్వలేదని ప్రిన్సిపాల్ స్పష్టం చేశారు.