30 లోపు ఆస్తిపన్ను చెల్లించకుంటే జరిమానా

Income Tax will pay on december ending otherwise fine applied - Sakshi

సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌లో ఆస్తి పన్ను బకాయిదారులు డిసెంబర్‌ 31లోపు చెల్లించాలని, లేకుంటే జనవరి 1వ తేదీ నుంచి జరిమానాలు విధాస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డా. బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఈపాటికే ఆస్తి పన్నును చెల్లించాలని వ్యక్తిగతంగా ఎస్సెమ్మెస్‌లను పంపామన్నారు. గురువారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో పన్ను, ట్రేడ్‌ లైసెన్స్‌ల వసూళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. ఆస్తి పన్నులు, ట్రేడ్‌ లైసెన్స్‌ పన్నులు వసూలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆస్తి, ట్రేడ్‌ లైసెన్స్‌ పన్నులను వసూలు చేయడంలో వెనుకబడ్డ సర్కిళ్లకు తాఖీదులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రేడ్‌ లైసెన్స్‌ కింద రూ.50 కోట్లు సేకరించాలని నిర్ణయించగా ఇప్పటికి రూ.72 కోట్లు వచ్చాయన్నారు. ఆస్తి పన్ను సేకరణలో 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.1206 కోట్లు వసూలు కాగా ప్రస్తుత 2017–18కి రూ.1,400 కోట్లు సేకరించాలని లక్ష్యంగా నిర్థారించామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top