ఆగస్టు 31లోగా ఆర్టీఐ కమిషనర్లను నియమించండి | High Court Give Green Signal To Recruitment Of RTI Commissioners | Sakshi
Sakshi News home page

ఆర్టీఐ కమిషనర్ల నియామకానికి హైకోర్టు ఆదేశం

Jul 15 2019 4:05 PM | Updated on Jul 15 2019 5:29 PM

High Court Give Green Signal To Recruitment Of RTI Commissioners - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఆర్టీఐ కమిషనర్ల నియామకానికి లైన్‌ క్లియర్‌ అయింది. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఆర్టీఐ కమిషనర్ల నియాకం చేపట్టాలని ప్రభుత్వాన‍్ని హైకోర్టు ఆదేశించింది. ఖాళీగా ఉన్న కమిషనర్ల పోస్టులను ఆగస్టు 31 లోపు భర్తీ చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాగా ఆర్టీఐలో ప్రస్తుతం ఒక్క కమిషనరే ఉండటంతో ఎలాంటి సమాచారం తెలుసుకోలేకపోతున్నామని ఆకాష్‌ కుమార్‌ అనే విద్యార్థి కోర్టును ఆశ్రయించాడు. ప్రజలకు అందుబాటులో ఉండేలా మరింతమంది కమిషనర్ల నియామకం చేపట్టాలని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ‍ జరిపిన హైకోర్టు పూర్తి స్థాయిలో ఆర్టీఐలో కమిషనర్ల నియామకం చేపట్టవచ్చని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement