సంగారెడ్డికి తరలిన కాంగ్రెస్‌ నేతలు | Congress leaders who have gone to Sangar Reddy | Sakshi
Sakshi News home page

సంగారెడ్డికి తరలిన కాంగ్రెస్‌ నేతలు

Jun 2 2017 2:33 AM | Updated on Sep 5 2017 12:34 PM

సంగారెడ్డిలో రాహుల్‌గాంధీతో నిర్వహించిన బహిరంగ సభకు ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల నుంచి నాయకులు గురువారం తరలివెళ్లారు. రాహుల్‌ గాంధీ వచ్చే ఎన్నికల్లో ప్రధాని కావడం ఖాయమన్నారు.

ఎల్లారెడ్డిపేట: సంగారెడ్డిలో రాహుల్‌గాంధీతో నిర్వహించిన బహిరంగ సభకు ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల నుంచి నాయకులు గురువారం తరలివెళ్లారు. రాహుల్‌ గాంధీ వచ్చే ఎన్నికల్లో ప్రధాని కావడం ఖాయమన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతుందని ఆరోపించారు. తరలివెళ్లిన వారిలో మండల అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, బూట శ్రీనివాస్, నాయకులు బండారి బాల్‌రెడ్డి, గౌస్, లక్ష్మారెడ్డి, పిట్లల ముత్యం, రాజు, బుచ్చిరెడ్డి, లింభానాయక్, పని శివ, భూక్య రాములు, గిరిధర్‌రెడ్డి, సత్యం, రాములు, రాజయ్య, లింగంగౌడ్‌ తదితరలున్నారు.

ముస్తాబాద్‌:  ప్రజాగర్జన  సభకు ముస్తాబాద్‌ నుంచి నాయకులు  తరలివెళ్లారు.  ఈ కార్యక్రమంలో  డీసీసీ కార్యదర్శి తిరుపతి మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు బుర్ర రాములు, దీటి నర్సింహులు, అగుళ్ల రాజేశం, నవీన్, ఎల్లాగౌడ్, రాజయ్య, నర్సింహరెడ్డి, సత్తయ్య, రాజమల్లు తదితరులు ఉన్నారు.

సిరిసిల్లరూరల్‌: సిరిసిల్ల అర్బన్‌ మండలం, తంగళ్లపల్లి మండలాల నుంచి సంగారెడ్డికి కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు తరలివెళ్లారు. సంగారెడ్డిలో జరిగే కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ బహిరంగసభకు సూమారు 500 మంది కాంగ్రెస్‌ నేతలు సంగీతం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో తరలివెళ్లారు.

ఇల్లంతకుంట: సంగారెడ్డిలో  సాయంత్రం జరిగిన కాంగ్రెస్‌ ప్రజాగర్జన సభకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి 2 వందల మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు తరలివెళ్లారు. వెళ్లిన వారిలో కాంగ్రెస్‌ కిసాన్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు పాశం రాజేందర్‌రెడ్డి, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కేశవరెడ్డి, పసుల వెంకటి, నక్క మహేష్, తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement