
సినీ, రాజకీయ రంగాల్లో హరికృష్ణ సేవలు మరువలేం..
సాక్షి, హైదరాబాద్ : సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించడం పట్ల సీఎం కే. చంద్రశేఖరరావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
సినీ, రాజకీయ రంగాల్లో హరికృష్ణ చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. హరికృష్ణ కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. విషాద సమయంలో ధైర్యంగా ముందుకు సాగాలని కోరారు.