అనాథలకు ‘అమ్మ’ ఆసరా | 'Amma' cultural, social charity seva organization coming for responsibility of children's | Sakshi
Sakshi News home page

అనాథలకు ‘అమ్మ’ ఆసరా

Nov 21 2014 2:56 AM | Updated on Oct 22 2018 7:26 PM

దీనికి స్పందించిన బెల్లంపల్లిలోని ‘అమ్మ’ సాంస్కృతిక, సాంఘిక...

కెరమెరి : అమ్మ మృతి చెందడం.. నాన్న తాగుడుకు బానిస కావడంతో అనాథలుగా మారిన చిన్నారుల వైనం ఈ నెల 13న ‘సాక్షి’లో ‘అమ్మ లేదు.. నాన్న రాడు’ కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన బెల్లంపల్లిలోని ‘అమ్మ’ సాంస్కృతిక, సాంఘిక స్వచ్చంధ సేవా సంస్థ అనాథ శరణాలయం నిర్వాహకులు చిన్నారుల ఆలనా, పాలనా చూసుకునేందుకు ముందుకొచ్చారు. గురువారం మండలంలోని బాబేఝరి (కొలాంగూడ)లో ఉంటున్న చిన్నారుల నానమ్మ, చిన్నాయన గంగారాంను కలిశారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఇంగ్లిష్ మీడియం చదువులు చదివిస్తామని, మా అనాథ శరణాలయంలో చిన్నారులను చేర్పించాలని ఆ సంస్థ ప్రధాన కార్యాదర్శి జాడి భాగ్యలక్ష్మి, కార్యదర్శి బింజి సుధాకర్ కోరారు.

 తమ పిల్లలు చాలా చిన్నారులని, మరి కొద్ది మాసాల తర్వాత పంపిస్తామని గంగారాం, పిల్లల నానమ్మ వారితో పేర్కొన్నారు. ప్రస్తుతం చిన్నారుల తాత ఇతర గ్రామంలో పాలేరుగా పని చేస్తునాన్నడని, ఆయన రావడానికి మరో మూడు మాసాలు పడుతుందన్నారు. వచ్చాక ఆయనతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉందని సమాజంలో పేరు ప్రఖ్యాతులుగాంచేలా  తీర్చి దిద్దుతామని అమ్మ నిర్వాహకులు చెప్పారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రాజశ్రీ కూడా వారికి ఎంతో నచ్చజెప్పినా ప్రస్తుతం ససేమిరా అన్నారు. కార్యక్రమంలో జనతాదల్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రేంకుమార్, ప్రధాన కార్యాదర్శి కుర్ర శంకర్ ,  అంగన్‌వాడీ  కార్యకర్త అనసూయ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement