breaking news
Amma cultural
-
శ్రీ శారదాంబికా నమోస్తుతే!
భారతదేశంలో ఉన్న అపురూపమైన సరస్వతీ దేవి ఆలయాల్లో ఒకటి శృంగేరీ శారదాదేవి ఆలయం. కర్ణాటక రాష్ట్రంలో తుంగానదీ తీరంలో ఆదిశంకరులు స్థాపించిన దక్షిణామ్నాయపీఠం శృంగేరి. ఈ పీఠాధిష్ఠాత్రి కూడా ఆమే. శారదాదేవి ఇక్కడ నెలకొని ఉండటానికి ఒక వృత్తాంతం ఉంది. ఒక శాపవశాత్తూ బ్రహ్మా సరస్వతులిద్దరూ మండనమిశ్ర, ఉభయభారతులై భూమిపై జన్మించారు. ఆదిశంకరులతో జరిగిన వాదంలో మండనమిశ్రులవారు ఓడిపోయి సన్యాసం స్వీకరించి సురేశ్వరాచార్యులనే పేరిట శృంగేరీ పీఠాధిపతిగా ఆదిశంకరులవారిచే నియమితులయ్యారు. ఉభయభారతీదేవి సాక్షాత్తు సరస్వతీస్వరూపమని తెలిసి ఉన్న శంకరులవారు ఆమెను అక్కడే కొలువై ఉండమని ప్రార్థించారు.శంకరుల విన్నపంతో ఉభయభారతీదేవి శారదాదేవిగా శృంగేరీలో కొలువు తీరింది. నిజానికి ఈ అమ్మవారి మూలరూపం చందనవిగ్రహం. అయితే ఈ విగ్రహాన్ని విద్యాశంకరుల ఆలయంలో ప్రతిష్ఠించి, తరువాతి కాలంలో ఇక్కడ స్వర్ణవిగ్రహరూపంలో పూజలందుకుంటోంది. శారదాదేవి రూపం స్వస్తికాసనంలో కూర్చుని కుడిచేతితో చిన్ముద్ర (జ్ఞానముద్ర)ను చూపుతూ, ఎడమచేతిలో పుస్తకం ధరించి ఉంటుంది.వెనుక కుడిచేత్తో జపమాలను, ఎడమచేత్తో అమృతకలశాన్ని ధరించి దర్శనమిస్తుంది. అమ్మవారికి వెనుక చిలుక కూడా ఉంటుంది. అఖండ విద్యాప్రదాయిని అయిన ఈ దేవి దర్శనంతో మనలోని అజ్ఞానపు మాలిన్యాలు తొలగి విజ్ఞానపు కాంతులు వెలుగొందుతాయి. చిన్ముద్ర, పుస్తకం, జపమాల, అమృత కలశం మొదలైనవన్నీ క్షయం లేనివనీ అవిద్యను రూపుమాపే విజ్ఞానపు సాధనాలనీ తెలుసుకోవాలి.– డాక్టర్ ఛాయా కామాక్షీదేవి (చదవండి: పైడితల్లికి ప్రణమిల్లి..!) -
అనాథలకు ‘అమ్మ’ ఆసరా
కెరమెరి : అమ్మ మృతి చెందడం.. నాన్న తాగుడుకు బానిస కావడంతో అనాథలుగా మారిన చిన్నారుల వైనం ఈ నెల 13న ‘సాక్షి’లో ‘అమ్మ లేదు.. నాన్న రాడు’ కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన బెల్లంపల్లిలోని ‘అమ్మ’ సాంస్కృతిక, సాంఘిక స్వచ్చంధ సేవా సంస్థ అనాథ శరణాలయం నిర్వాహకులు చిన్నారుల ఆలనా, పాలనా చూసుకునేందుకు ముందుకొచ్చారు. గురువారం మండలంలోని బాబేఝరి (కొలాంగూడ)లో ఉంటున్న చిన్నారుల నానమ్మ, చిన్నాయన గంగారాంను కలిశారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఇంగ్లిష్ మీడియం చదువులు చదివిస్తామని, మా అనాథ శరణాలయంలో చిన్నారులను చేర్పించాలని ఆ సంస్థ ప్రధాన కార్యాదర్శి జాడి భాగ్యలక్ష్మి, కార్యదర్శి బింజి సుధాకర్ కోరారు. తమ పిల్లలు చాలా చిన్నారులని, మరి కొద్ది మాసాల తర్వాత పంపిస్తామని గంగారాం, పిల్లల నానమ్మ వారితో పేర్కొన్నారు. ప్రస్తుతం చిన్నారుల తాత ఇతర గ్రామంలో పాలేరుగా పని చేస్తునాన్నడని, ఆయన రావడానికి మరో మూడు మాసాలు పడుతుందన్నారు. వచ్చాక ఆయనతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉందని సమాజంలో పేరు ప్రఖ్యాతులుగాంచేలా తీర్చి దిద్దుతామని అమ్మ నిర్వాహకులు చెప్పారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజశ్రీ కూడా వారికి ఎంతో నచ్చజెప్పినా ప్రస్తుతం ససేమిరా అన్నారు. కార్యక్రమంలో జనతాదల్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రేంకుమార్, ప్రధాన కార్యాదర్శి కుర్ర శంకర్ , అంగన్వాడీ కార్యకర్త అనసూయ ఉన్నారు.


