breaking news
Mothers death
-
అనాథలకు ‘అమ్మ’ ఆసరా
కెరమెరి : అమ్మ మృతి చెందడం.. నాన్న తాగుడుకు బానిస కావడంతో అనాథలుగా మారిన చిన్నారుల వైనం ఈ నెల 13న ‘సాక్షి’లో ‘అమ్మ లేదు.. నాన్న రాడు’ కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన బెల్లంపల్లిలోని ‘అమ్మ’ సాంస్కృతిక, సాంఘిక స్వచ్చంధ సేవా సంస్థ అనాథ శరణాలయం నిర్వాహకులు చిన్నారుల ఆలనా, పాలనా చూసుకునేందుకు ముందుకొచ్చారు. గురువారం మండలంలోని బాబేఝరి (కొలాంగూడ)లో ఉంటున్న చిన్నారుల నానమ్మ, చిన్నాయన గంగారాంను కలిశారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఇంగ్లిష్ మీడియం చదువులు చదివిస్తామని, మా అనాథ శరణాలయంలో చిన్నారులను చేర్పించాలని ఆ సంస్థ ప్రధాన కార్యాదర్శి జాడి భాగ్యలక్ష్మి, కార్యదర్శి బింజి సుధాకర్ కోరారు. తమ పిల్లలు చాలా చిన్నారులని, మరి కొద్ది మాసాల తర్వాత పంపిస్తామని గంగారాం, పిల్లల నానమ్మ వారితో పేర్కొన్నారు. ప్రస్తుతం చిన్నారుల తాత ఇతర గ్రామంలో పాలేరుగా పని చేస్తునాన్నడని, ఆయన రావడానికి మరో మూడు మాసాలు పడుతుందన్నారు. వచ్చాక ఆయనతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉందని సమాజంలో పేరు ప్రఖ్యాతులుగాంచేలా తీర్చి దిద్దుతామని అమ్మ నిర్వాహకులు చెప్పారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజశ్రీ కూడా వారికి ఎంతో నచ్చజెప్పినా ప్రస్తుతం ససేమిరా అన్నారు. కార్యక్రమంలో జనతాదల్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రేంకుమార్, ప్రధాన కార్యాదర్శి కుర్ర శంకర్ , అంగన్వాడీ కార్యకర్త అనసూయ ఉన్నారు. -
విషాహారంతో అస్వస్థత
మెదక్ రూరల్, న్యూస్‌లైన్: భోజనం చేసి పడుకున్న తల్లీకొడుకు ఉన్నట్టుండి అస్వస్థతకు లోనైయ్యారు. కడుపునొప్పి, వాంతులు కావటంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే తల్లి మృతి చెందగా, ఆమె కుమారుని పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మండల పరిధిలోని పాతూరు పంచాయతీ పరిధిలోని చీపురుదుబ్బతండాలో సోమవారం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం...తండాకు చెందిన కేతావత్ మంగ(35) కేతావత్ దేవ్‌జ దంపతులకు కుమారుడు, కూతురు సంతానం. కూతురు వేరే చోట హాస్టల్లో ఉండి చదువుకుంటుండగా, కుమారుడు నరేష్ తల్లిదండ్రులవద్దే ఉంటూ మెదక్ పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువు తున్నాడు. దేవ్‌జ, అతని తమ్ముడు రమేష్‌లు కుటుంబాలు కలిసి ఉంటున్నాయి. ఈ క్రమంలో ఆదివారం దేవ్‌జ, అతని తమ్ముడు రమేష్‌లు ఓ విందుకు వెళ్లి అక్కడే భోజనాలు చేసి వచ్చారు. దీంతో మంగ, ఆమె కుమారుడు నరేష్‌లు ఆదివారం సాయంత్రం తండాకు విక్రయానికి వచ్చిన చేపలు కొని వాటితో కూర చేసుకుని తిని పడుకున్నారు. కాగా రాత్రి 12 గంటల సమయంలో ముందుగా మంగకు వాంతులవడంతో పాటు కడుపులో నొప్పి ప్రారంభమైంది. ఆమెను మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించటంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృత్యువాత పడింది. అనంతరం నరేష్‌కు సైతం వాంతులవడంతో పాటు కడుపు నొప్పి ప్రారంభమైంది. దీంతో బంధువులు నరేష్‌ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పాతూరు గ్రామస్థులు తండావాసులు మృతురాలు ఇంటికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. దీంతో చీపురుదుబ్బతండాలో విషాదం నెలకొంది. విషాహారమా..? మంగ, ఆమె కుమారుడు రాత్రి తిన్న చేపలకూరే విషాహారమైందా లేక ఆహారంలో ఏదైనా విషం కలిసిందా అని స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే మంగతో పాటు తండాలోని చాలా మంది చేపలు కొని వండుకు తిన్నా, వారంతా బాగానే ఉన్నారని, అందువల్లే వారే ఆహారంలో విషం కలుపుకున్నారా అని వారు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రూరల్ ఎస్ఐ వేణుకుమార్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.