గ్యాస్ ట్యాంకర్ పేలుడు.. ఇద్దరు మృతి | Gas tanker blast .. Two died | Sakshi
Sakshi News home page

గ్యాస్ ట్యాంకర్ పేలుడు.. ఇద్దరు మృతి

May 19 2015 11:37 PM | Updated on Sep 3 2017 2:19 AM

గ్యాస్ ట్యాంకర్ పేలుడు.. ఇద్దరు మృతి

గ్యాస్ ట్యాంకర్ పేలుడు.. ఇద్దరు మృతి

గ్యాస్ ట్యాంకర్ పేలిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి...

వెల్డింగ్ పనులు చేస్తుండగా ఘటన
ముంబై:
గ్యాస్ ట్యాంకర్ పేలిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పేలుడు ధాటికి ట్యాంకర్ రెండు ముక్కలైపోయి చెల్లాచెదురైంది. వివరాల్లోకెళితే.. చెంబూర్ గడ్కరీ మార్గంపై ఉన్న ఓ గ్యారేజీలో మంగళవారం పేలుడు సంభవించింది. గ్యాస్ రవాణా చేసే ఖాళీ ట్యాంకర్‌కు మరమ్మతు పనుల్లో భాగంగా వెల్డింగ్ చేస్తుండగా భారీ శబ్దంతో పేలిపోయింది. వెల్డింగ్ పనులు చేస్తున్న షఫిక్ షేక్(18) అనే వ్యక్తితోపాటు మరో 45 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. గ్యారేజీలో పనిచేసే మరో వ్యక్తికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. టాంకర్‌లో కొంచెం గ్యాస్ మిగిలిపోవడంతో వెల్డింగ్ చేస్తున్న సమయంలో నిప్పంటుకుని ట్యాకర్ పేలిపోయిందని బీఎంసీ డి జాస్టర్ కంట్రోల్ సంస్థ తెలిపింది. ఈ ఘటనలో చుట్టుపక్కల భవనాలకు ఎలాంటి నష్టం జరగలేదు. టాటాపవర్‌కు చెందిన పవర్‌లైన్ ఓవర్‌హెడ్‌కు నష్టం జరిగినట్లు పేర్కొంది.

తృటిలో తప్పిన పెను ముప్పు
ట్యాంకర్ పేలుడు జరిగిన స్థలానికి సమీపంలోనే హిందుస్తాన్ పెట్రోలియం కంపెనీకి చెందిన స్టోరీజీ సెంటర్ ఉంది. అక్కడ వేల  లీటర్ల పెట్రోల్ స్టోర్ చేస్తుంటారు. పేలుడు జరిగినపుడు అగ్నికీలలు అక్కడివరకు చేరుకుని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువగా ఉండేది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement