పుష్కర్ (66) అర్ధసెంచరీతో రాణించడంతో ఎం.ఎల్.జైసింహా ఎలెవన్ జట్టు 193 పరుగులు చేసి ఆలౌటైంది.
ఎం.ఎల్.జైసింహా 193 ఆలౌట్ సీనియర్ జోనల్ క్రికెట్
సాక్షి, హైదరాబాద్: పుష్కర్ (66) అర్ధసెంచరీతో రాణించడంతో ఎం.ఎల్.జైసింహా ఎలెవన్ జట్టు 193 పరుగులు చేసి ఆలౌటైంది. లాలా హర్బన్స్ రాయ్ ట్రోఫీ సీనియర్ జోనల్ టోర్నీ మొదట బ్యాటింగ్‌కు దిగిన జైసింహా జట్టులో పుష్కర్‌తో పాటు రాహుల్ బుద్ధి (39) మెరుగ్గా ఆడాడు.
తర్వాత బ్యాటింగ్ చేపట్టిన కంబైన్డ్ ఎలెవన్ 4 ఓవర్లో వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో కృష్ణమూర్తి ఎలెవన్ 95 పరుగులకే ఆలౌటైంది. ప్రెసిడెంట్ ఎలెవన్ బౌలర్లు కార్తికేయ 4, తనయ్ త్యాగరాజన్ 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ప్రెసిడెంట్ జట్టు వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది.
మ్యాచ్‌లు వాయిదా
వర్షం వల్ల క్రికెట్ మ్యాచ్‌ల్ని వాయిదా వేశారు. సీనియర్ జోనల్ క్రికెట్ టోర్నీలో నేడు మూడు మ్యాచ్‌లు మినహా మిగతా పోటీలు సాధ్యపడలేదు. మైదానాలన్నీ వాన నీటితో చిత్తడిగా మారడంతో తొలి రోజు ఆటను రద్దు చేశారు. అయితే తదుపరి జరిగే మ్యాచ్‌లను రీ షెడ్యూలు చేస్తామని హెచ్‌సీఏ కార్యదర్శి జాన్‌మనోజ్ ఒక ప్రకటనలో తెలిపారు.