కూతురు ముచ్చట తీర్చిన ధోని

MS Dhoni Helps Daughter Ziva To Build Snowman In Dehradun - Sakshi

డెహ్రాడూన్‌ : టీమిండియా మాజీ కెప్టెన్‌.. మిస్టర్‌ కూల్‌ ఎంఎస్‌ ధోని మంచు కొండల్లో కుటుంబంతో కలిసి విహరిస్తున్నాడు. అటు క్రికెట్‌కు ఇటు కుటుంబంతో గడపడానికి సమ ప్రాధాన్యమిచ్చే ధోని.. తాజాగా డెహ్రాడూన్‌ యాత్రకు వెళ్లాడు. తన అద్భుతమైన ఆటతోనే కాకుండా.. కూతురు చిన్నారి జీవాతో ఆడుకుంటున్న వీడియోలను సోషల్‌ మీడియాలో పంచుకుని అభిమానులను అలరిస్తుంటాడు ధోని. ఇక డెహ్రాడూన్‌లో.. కూతురు జీవా మంచు మనిషిని రూపొందిస్తుండగా.. ఆమెకు సాయం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ధోని అభిమానుల గ్రూప్‌ ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ వీడియో వైరల్‌ అయింది. ప్రపంచకప్‌ ముగిసిన అనంతరం ధోని ఆటకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ తండ్రీ కూతుళ్ల అనుబంధంపై సోషల్‌ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘ధోని సూపర్‌ డాడ్‌’ అంటూ కొందరు ప్రశంసిస్తున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top