సింగపూర్‌లో సత్తాచాటిన భారత షట్లర్లు | indian shutlers sai praneeth, kidambi srikanth enter into singapore super series | Sakshi
Sakshi News home page

సింగపూర్‌లో సత్తాచాటిన భారత షట్లర్లు

Apr 15 2017 6:29 PM | Updated on May 29 2019 3:19 PM

సింగపూర్‌లో సత్తాచాటిన భారత షట్లర్లు - Sakshi

సింగపూర్‌లో సత్తాచాటిన భారత షట్లర్లు

సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌​లో భారత షట్లర్లు సాయి ప్రణీత్‌, కిడాంబి శ్రీకాంత్‌ సత్తాచాటారు.

సింగపూర్‌: సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌​లో  భారత షట్లర్లు సాయి ప్రణీత్‌, కిడాంబి శ్రీకాంత్‌ సత్తాచాటారు. పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ రేసులో వీరిద్దరూ ఫైనల్‌కు దూసుకెళ్లి.. భారత్‌కు స్వర్ణ పతకాన్ని ఖాయం చేశారు.

శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో సాయి ప్రణీత్‌ 21-6, 21-8 స్కోరుతో లీ డాంగ్‌పై అలవోకగా విజయం సాధించాడు. మరో సెమీస్‌​లో శ్రీకాంత్‌  21-13, 21-14తో ఆంథోనిను ఓడించాడు. ఫైనల్‌ సమరంలో ప్రణీత్‌, శ్రీకాంత్‌ అమీతుమీ తేల్చుకోనున్నారు. ఫైనల్లో ఎవరు గెలిచినా పసిడి, రజత పతకాలు రెండూ భారత్‌కు దక్కనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement