
వాలెన్సియా మ్యాజిక్
మిడ్ ఫీల్డర్ ఎన్నెర్ వాలెన్సియా రెండు గోల్స్‌తో రెచ్చిపోవడంతో ఈక్వెడార్‌కు టోర్నీలో తొలి విజయం దక్కింది.
హోండురస్‌పై 2-1తో ఈక్వెడార్ విజయం
కురిటీబా: మిడ్ ఫీల్డర్ ఎన్నెర్ వాలెన్సియా రెండు గోల్స్‌తో రెచ్చిపోవడంతో ఈక్వెడార్‌కు టోర్నీలో తొలి విజయం దక్కింది. గ్రూప్ ఇలో భాగంగా శనివారం తెల్లవారు జామున హోండురస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈక్వెడార్ 2-1తేడాతో నెగ్గింది. అయితే ప్రపంచకప్ చరిత్రలో గెలుపు బోణీ చేయాలని ఎదురుచూస్తున్న హోండురస్.. 31వ నిమిషంలోనే స్ట్రయికర్ కార్లోస్ కాస్ట్లీ గోల్‌తో 1-0 ఆధిక్యం సాధించింది. కానీ 34వ నిమిషంలోనే ప్రత్యర్థి దూకుడు పెంచి స్కోరును సమం చేసింది. బంతిని ఆపేందుకు బాక్స్‌కు కుడి వైపు గోల్ కీపర్ చాలా ముందుకు వెళ్లగా అతడిని ఏమార్చిన వాలెన్సియా అతి సమీపం నుంచి గోల్ చేశాడు. 65వ నిమిషంలోనూ అయోవి ఫ్రీ కిక్‌ను ఆరు గజాల దూరం నుంచి వాలెన్సియా తీసుకుని రెండో గోల్‌ను చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.